కామధేనుగుణా విద్యా హ్యకాలే ఫలదాయినీ । ప్రవాసే మాతృసదృశీ విద్యా గుప్తం ధనం స్మృతమ్ ॥
కామధేనుగుణాకామధేను గుణాలు గల
విద్యావిద్య
హినిజముగా
అకాలేఅసమయంలో / అనుకోని సమయంలో
ఫలదాయినీఫలం ఇచ్చేది
ప్రవాసేపరదేశంలో
మాతృసదృశీతల్లి వంటిది
విద్యావిద్య
గుప్తమ్దాచబడిన
ధనమ్ధనము
స్మృతమ్అని చెప్పబడింది
విద్య కామధేనువు లాంటి గుణాలు కలిగి, అనుకోని సమయంలో కూడా ఫలాలు ఇస్తుంది. పరదేశంలో తల్లిలా రక్షిస్తుంది. విద్య దాచిన సంపద అని అంటారు.
educationprotection