ఆహారనిద్రాభయమైథునం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణామ్ । ధర్మో హి తేషామధికో విశేషః ధర్మేణ హీనాః పశుభిః సమానాః ॥
ఆహారఃఆహారం
నిద్రానిద్ర
భయమ్భయం
మైథునమ్మైథునం
చమరియు
సామాన్యమ్సామాన్యం
ఏతత్ఇది
పశుభిఃపశువులతో
నరాణామ్మనుషుల
ధర్మఃధర్మము
హినిజముగా
తేషామ్వారి
అధికఃఅధికం
విశేషఃవిశేషం
ధర్మేణధర్మంతో
హీనాఃలేనివారు
సమానాఃసమానం
తినడం, పడుకోవడం, భయపడటం, పిల్లల్ని కనడం... ఇవి జంతువులు కూడా చేస్తాయి. కానీ ఏది ధర్మం, ఏది అధర్మం అని వివేచించే శక్తి ఉంటేనే మనం మనుషులం. అది లేకపోతే మనకీ వాటికీ తేడా లేదు.
dharmahumanity